ఈటల రాజేందర్ చుట్టూ ఇప్పుడు హాట్ పాలిటిక్స్ నెలకొన్నాయి. మొన్నటి వరకు ఆయన ఏ పార్టీలో
చేరతారో అని అంతా ఆసక్తిగా ఎదరుచూశారు. వరుసగా కాంగ్రెస్, బీజేపీ నేతలను కలవడంతో గందరగోళం నెలకొంది. కానీ ఫైనల్‌గా ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన నిన్న ఢిల్లీ కూడా వెళ్లారు. అయితే ఇప్పుడు ఆ పార్టీలోకే వెళ్లడానికి అసలు కారణం వేరే ఉంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కేడర్‌ను మొత్తం టీఆర్ ఎస్ నయానో, భయానో లాగేసుకుంటోంది. అలాంటప్పుడు ఆయన ఉనికిని కాపాడుకోవాలంటే భవిష్యత్ ఉన్న బీజేపీలో చేరడం మంచిదని భావించారు.
ఇంకోవైపు కేసీఆర్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసుల్లో అరెస్టు చేయకుండా కేంద్రం తనకు రక్షణ ఇస్తుందని భావిస్తున్నారు. ఇదే విషయంపై బీజేపీ రాష్ట్ర నాయకులు హామీ ఇచ్చినట్టు సమాచారం. తనపై వచ్చిన అభియోగాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అలాగే బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే మంచి పదవి ఇస్తామని తెలిపినట్టు సమాచారం. ఇలా అన్ని ఆలోచించుకుని ఆయన బీజేపీలోకి వెళ్తున్నట్టు సమాచారం.