ఆ రెండు తెలుగు ఛాన‌ళ్ల‌పై చ‌ర్య‌లు ఆపండి.. ఏపీ ప్ర‌భుత్వానికి సుప్రీం షాక్‌

-

ఏపీ ప్ర‌భుత్వం, సీఐడీకి ఈ మ‌ధ్య వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఎందులో అనుకున్నారు. అదేనండి ఎంపీ రఘురామ‌కృష్ణంరాజు కేసులో. ఈ కేసులో సుప్రీంకోర్టు వ‌రుస షాక్‌లు ఇస్తోంది సీఐడీకి. ర‌ఘురామ కేసులో భాగంగా రెండు తెలుగు న్యూస్ ఛానెళ్లపై నమోదైన రాజద్రోహ కేసులపై ఏపీ ప్ర‌భుత్వానికి, సిఐడికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు ఇచ్చింది.

జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ కేసులో వాద‌న‌లు విని, ఆరు వారాల్లోగా తమ కౌంటర్ అఫిడవిట్లను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీఐడికి నోటీసులు ఇచ్చింది. ఆ రెండు తెలుగు ఛాన‌ళ్ల‌పై చర్యలు తీసుకోకుండా స్టే ఇచ్చింది కోర్టు.

ఆ రెండు న్యూస్ ఛానళ్లు ర‌ఘురామ‌కు స‌పోర్టు చేస్తూ వార్త‌లు ప్ర‌చ‌రించి, ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే విధంగా ప్ర‌య‌త్నించాయంటూ వాటిపై రాజ‌ద్రోహం కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ రెండు ఛాన‌ళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార పిటిషన్ ను వేశాయి. వీటిని ప‌రిశీలించిన కోర్టు.. ఛాన‌ళ్ల‌లో క‌రోనా నివేదిక‌లు ప్రసారం చేసినందున వాటిపై ఇప్పుడు చ‌ర్య‌లు తీసుకోవ‌డంపై స్టే ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version