హర్యానాలో వింత.. 30వేల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగాయని చెబుతున్న పోలీసులు..

-

అక్రమంగా మద్యం రవాణా చేసినప్పుడు సహజంగానే ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో సాధారణ పోలీసులు కూడా ఈ తరహా కేసులను నమోదు చేస్తుంటారు. అయితే పట్టుకున్న మద్యాన్ని కోర్టు కేసులు, తీర్పుల అనంతరం ధ్వంసం చేస్తారు. ఇది ఎక్కడైనా జరుగుతుంది. కానీ హర్యానాలో మాత్రం వింత చోటు చేసుకుంది. అక్రమంగా రవాణా చేయబడ్డ మద్యాన్ని సీజ్‌ చేయగా.. మొత్తం మద్యాన్ని ఎలుకలు తాగాయని, అందువల్ల ఆ మద్యం కనిపించడం లేదని.. అక్కడి పోలీసులు చెబుతున్నారు.

Strange in Haryana .. Police say rats drank 30,000 liters of liquor ..

హర్యానాలోని ఫరీదాబాద్‌ పరిధిలో మొత్తం 30 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. వాటిల్లో 25 పోలీస్‌ స్టేషన్లకు చెందిన స్టోర్‌ రూమ్‌లలో అక్రమంగా రవాణా చేసిన, పలు ఇతర సంఘటనల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం 30వేల లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేసి నిల్వ ఉంచారు. అయితే ఆ మద్యంలో విదేశీ మద్యం, బీర్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆ మద్యానికి సంబంధించిం మొత్తం 825 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కేసులలో తీర్పులు వస్తే ఆ మద్యం మొత్తాన్ని సాధారణంగా అయితే ధ్వంసం చేస్తారు. అయితే ఆ కేసుల్లో తీర్పు రాకముందే ఆ స్టోర్‌ రూమ్‌లలో నిల్వ చేసి ఉంచిన మద్యం మొత్తం కనిపించకుండా పోయింది.

ఇలా మద్యం కనిపించకుండా పోవడంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా కింది స్థాయి పోలీసు అధికారులు మాత్రం.. ఆ మద్యాన్ని ఎలుకలు తాగేశాయని చెబుతుండడం విశేషం. ఎలుకలు సాధారణ మద్యమే కాదు, విదేశీ మద్యం, బీర్లను కూడా తాగాయని వారు చెబుతున్నారు. దీంతో ఆ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అవాక్కవుతున్నారు. అయితే అంత భారీ స్థాయిలో, అన్ని స్టోర్‌ రూమ్‌ల నుంచి ఒకేసారి పెద్ద ఎత్తున మద్యం మాయం కావడం పట్ల పోలీసు ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news