ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పథకాన్ని ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. దీంతో ఏపీలోని మహిళలు ఎలాంటి చార్జీలు లేకుండా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో ఏపీలో స్త్రీ శక్తి పథకానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని ఎండి ద్వారక తిరుమల రావు స్పష్టం చేశారు.

బస్సులలో రద్దీకి తగినట్లుగా రాబోయే రోజులలో అదనంగా బస్సులను ఏర్పాటు చేస్తామని ద్వారక తిరుమలరావు చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడానికి విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించిన బస్సులలో స్త్రీ శక్తి పథకం వర్తించదని స్పష్టం చేశారు. రోజు కనీసం 18 లక్షల మంది మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారని ద్వారక తిరుమల రావు వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ పథకానికి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య మానవులు, నిరుపేద మహిళలు వారు వెళ్లే చోటుకి ఎలాంటి ఖర్చులు లేకుండా చేరుకుంటున్నారు.