యూరియా కొరత ఉన్న తరుణంలో…తెలంగాణ రైతాంగానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణకు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు చేయనుంది. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి యూరియా తరలింపునకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.

ఈ మేరకుకేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. ఈ తరుణంలోనే వారంలో తెలంగాణ రాష్ట్రానికి యూరియా పంపిస్తామని కేంద్రం హామీఇచ్చింది. తక్షణమే 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపనకు కేంద్రం హామీ ఇచ్చింది. గుజరాత్, కర్నాటక నుంచి యూరియా తరలించాలని ఆదేశించింది. వారం రోజుల్లో రాష్ట్రానికి యూరియా వస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.