వీధి కుక్కల బీభత్సం.. ఏడాది పాపపై దాడి

-

తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల స్వైరవిహారం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. వివిధ ప్రాంతాల్లో జరిగిన కుక్కల దాడిలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వరంగల్ జిల్లాలోని ఎల్బీనగర్, ఇస్లాంపూరాలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరోవైపు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు చెన్నంపల్లి ప్రాధమిక పాఠశాలలో విద్యార్థి పై కుక్క దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.

జూన్ 28వ తేదీ బుధవారం వరంగల్ పట్టణంలోని ఎల్బీనగర్, ఇస్లాంపురా ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇంట్లో ఆడుకుంటున్న ఏడాది పాపపై కుక్కల దాడి చేయగా.. చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారి మొహంపై కుక్క కరవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. పాపతో పాటు ఆ ప్రాంతంలో పలువురిపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు గాయాలపాలైయ్యారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. అధికారులు సరైన చర్యలు చేపట్టడం లేదని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version