సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. ముఖ్యంగా ఫుడ్ కు సంబందించిన వీడియోలు మాత్రం బాగా ట్రెండ్ అవుతున్నాయి..ఫుడ్ కు సంబందించి రోజుకో హోటల్ దర్శనమిస్తుంది..ఇక కస్టమర్లను ఆకట్టుకోవడానికి స్ట్రీట్ ఫుడ్ నిర్వాహకులు కొత్త వంటలను పరిచయం చేస్తున్నారు.. కొన్ని వర్కౌట్ అయితే మరికొన్ని ఫెయిల్ అవుతున్నాయి.. ఇందులో భాగంగా మనం ఇప్పటివరకూ రకరకాల వంటకాలు చూశాం. ఐస్క్రీమ్ పరోటా, ఫాంట నూడుల్స్, ఐస్క్రీమ్ పానీపూరీ, థమ్స్ అప్ పానీపూరీ, ఇలా రకరకాల వంటకాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
తాజాగా ఓ స్ట్రీట్ వ్యాపారి సరికొత్త దోశను పరిచయం చేశాడు. దీన్ని చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. సాధారణంగా నెట్టింట ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. ఈ దోశ వీడియో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.. మాములుగా దోశను దోశలాగా కాకుండా వెరైటీగా చేసాడు… అది అందరిని తెగ ఆకట్టుకుంది..
ఇతను ఈ దోశను రకరకాల షేప్స్లో వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఇతను టెడ్డీబేర్ షేప్లో దోశను వేసి కస్టమర్స్ మదిని దోచేశాడు. ఈ దోశలు చూసి సామాన్యుల నుంచి బడా వ్యాపారవేత్తలు సైతం ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను నాంది ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్ ట్విటర్లో షేర్ చేశారు… అతనికి కొత్తగా ఆలోచన జోడించడం పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేసుకోండి..
I believe India’s street food vendors are the most innovative, resilient and impactful food influencers. More than any gourmet chef. Been wondering how to work with them to influence a nutritive food system.
Please applaud this guy’s artistic skills.
#StreetFood #Arakunomics pic.twitter.com/h7Bvrs5TTJ
— Manoj Kumar (@manoj_naandi) March 3, 2023