పీఎం కిసాన్ డబ్బులు ఇంకా రాలేదా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..!

-

రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా చక్కటి లాబాల్ కలుగుతున్నాయి. కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో పీఎం కిసాన్ యోజన కూడా ఒకటి. ఫిబ్రవరి 27న రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ యోజన 13వ విడత డబ్బులు పడ్డాయి. 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు నగదు ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది.

కొంత మందికి మాత్రం రూ.2000 జమకాలేదు. ఇక మరి వారు ఏం చెయ్యాలి..? ఎలా ఆ డబ్బు పొందాలి అనేది చూసేద్దాం. కొందరికి డబ్బు పడకపోవడానికి పలు కారణాలున్నాయి. మీకు కూడా రాలేదా..? అయితే ఇలా చేస్తే 13వ విడత నగదు పొందే అవకాశం ఉంది. పీఎం కిసాన్ యోజన కోసం మీరు దరఖాస్తు చేస్తున్నప్పుడు, బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్ సరైన వివరాలు ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఈ స్కీమ్ డబ్బులు రావు. పూరించలేకపోతే డబ్బు నిలిచిపోతుందని గుర్తు పెట్టుకోండి. మీరు సరైన సమాచారం ఇచ్చారా లేదా అనేది తెలుసుకోవడానికి pmkisan.gov.in ని సందర్శించండి.

ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి. అక్కడ ఫార్మర్ కార్నర్ ఉంటుంది.
దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి.
ఆధార్ నంబర్, అకౌంట్ నంబర్, ఫోన్ నంబర్ వంటివి వస్తాయి.
ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, గెట్ డేటాపై క్లిక్ చేయండి.
సమాచారం వచ్చేస్తుంది. ఆధార్ నంబర్, ఖాతా నంబర్ తప్పుగా ఉంటే దాన్ని సరిచేయవచ్చు.
రూ. 2000 జమకాకపోతే pmkisan-ict@gov.in ఇమెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు
లేకపోతే PM కిసాన్ యోజన- 155261 లేదా 1800115526 లేదా 011-23381092 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version