పెన్సిల్ పోయిందని పోలీసు స్టేషన్ లో విద్యార్థుల ఫిర్యాదు

-

మనం ఎదైన జరుగకూడని సంఘటన జరిగితే… పోలీస్‌ స్టేషన్‌ కు వెళతాము. దొంగ తనం, మర్డర్‌, కిడ్నాప్‌ లాంటి కేసుల్లో చాలా మంది పోలీస్‌ స్టేషన్‌ గడప తొక్కుతారు. ఇంకా భూ తగదాలు జరిగినప్పుడు పోలీస్‌ స్టేషన్‌ కు వెళతాము. అయితే….ఈ మధ్య కాలంలో గేదె పాలు ఇవ్వడం లేదని… దెయ్యం తిరుగుతుందని.. కొంత మంది పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు.

అయితే… తాజాగా పెన్సిల్‌ పోయిందని కొంత మంది చిన్నారులు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లారు. ఈ ఘటన కర్నూలు జిల్లా పెదకడుబూరు లో చోటు చేసుకుంది. హన్మంతు అనే బాలుడు తన పెన్సిల్‌ ను తొటి విద్యార్థి దొంగతనం చేశాడంటూ…. పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చాడు. ఆ విద్యార్థి పై పోలీస్‌ కేసు పెట్టాలని పోలీసులను కోరాడు. అయితే.. దీనిపై స్పందించిన పోలీసులు.. ఆ బాలుడికి నచ్చ జెప్పి.. అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం ఈ ఘటన కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియో ను చూసిన వారందరూ నవ్వుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news