BREAKING: నారాయణ కాలేజీలో విద్యార్థి దుర్మరణం..!

-

BREAKING: నారాయణ కాలేజీలో విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. నారాయణ కాలేజీల్లో రోజుకో అన్యాయం జరుగుతోంది. నెలకో సంఘటన నారాయణ కాలేజీలో ఇలాంటి సంఘటన జరుగుతూనే ఉంది. తాజాగా నారాయణ కాలేజీలో విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ నారాయణ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది.

Student’s death in Narayana College

విద్యుత్ షాక్ తగిలి గిరీష్ కుమార్ అనే విద్యార్థి మృతి చెందాడు. హస్టల్ లో ఉండటం ఇష్టం లేని గిరీష్ గత అర్థరాత్రి గోడ దూకే ప్రయత్నం చేయగా.. గోడపై ఉన్న విద్యుత్ తీగలు తగిలి గిరీష్ అక్కడిక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గిరీష్ మృతితో తోటి విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news