సుజనా చౌదరిని అరస్ట్ చేయండి అంటూ అమిత్ షా మీద  ఒత్తిడి .. ఎవరు ఆ ఒత్తిడి తెస్తున్నారో తెలుసా అసలు ?

-

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులలో ఒకరు సుజనాచౌదరి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో మంత్రిగా పనిచేసిన సుజనాచౌదరి 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ప్రస్తుతం బిజెపి పార్టీలో కొనసాగుతున్న సుజనా చౌదరి స్టార్టింగ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఇటీవల బిజెపి పార్టీ నాయకులు వైయస్ జగన్ తో చాలా సన్నిహితంగా ఉండటంతో పాటు అనధికారికంగా పొత్తు వ్యవహరించడంతో సుజనా చౌదరి కి బీజేపీ రోజు రోజుకి ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇటువంటి తరుణంలో వైయస్ జగన్ను రాజకీయంగా చాలాసార్లు ఇబ్బంది పెట్టిన సుజనాచౌదరి అరెస్ట్ చేయండి అని బిజెపి పార్టీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి ఒత్తిడి తీసుకు వచ్చినట్లు జాతీయ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే ఇటీవల కొద్దిరోజుల క్రితమే ఆయనకి బ్యాంకు నోటీసులు ఇవ్వడం, ఆయన బ్యాంకు దగ్గర తీసుకున్న అప్పు చెల్లించకపోతే అరెస్టు చేసేందుకు సిద్దమవుతున్నట్టు గా సంకేతాలు ఇవ్వడం చర్చగా మారింది.ప్రస్తుతం సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

 

అయితే ఆయనకు రాజకీయంగా క్షేత్రస్థాయిలో బలం లేదన్న సంగతి బిజెపికి కూడా తెలుసు. ఈ మేరకు సాక్షాలతో సహా ఆధారాలతో సహా సుజనా చౌదరి బ్యాంకు దగ్గర రుణాలు తీసుకొని ఎగోట్టినట్లు ఆధారాలు ఉండటంతో కేంద్ర ఆర్థిక శాఖపై ఆర్బీఐ కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.సుజనా వ్యవహారంలో బ్యాంక్ లు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, సుజనా వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవద్దని ఆర్బీఐ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కేంద్ర పెద్దలు కూడా సుజనా చౌదరి వ్యవహారాన్ని చాలా లైట్ గా తీసుకున్నారు అని జాతీయ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. దీంతో త్వరలోనే ఐటి, ఈడీ శాఖలు సుజనా చౌదరి ని విచారించే అవకాశం ఉందని జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version