మీరు చూస్తున్న ఈ ఫుడ్ జాయింట్ ఉత్తర కోల్‌కతాలో ఉంది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉందని చరిత్ర చెప్తుంది. అసలు ఏంటీ అంటే… ఈ ఫుడ్ జాయింట్ కు నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఉత్తర కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కాలేజీలో చదువుతున్నప్పుడు తరచూ వచ్చేవారు. దీని పేరు… లక్ష్మీ నారాయణ్ షా అండ్ సన్స్. అందరికీ ‘నేతాజీ షాప్’ అని సుపరిచితం అన్నమాట. ఖేడు షా 1918 లో లక్ష్మీ నారాయణ్ షా అండ్ సన్స్ ను స్థాపించారు.
అప్పుడు భారత్ బ్రిటిష్ పాలనలో ఉంది. మన స్వాతంత్ర్య సమరయోధులు స్వేచ్ఛా దేశం కోసం పోరాటం చేస్తున్న సమయంలో దీన్ని స్థాపించగా అప్పటి నుంచి కూడా దీనికి మంచి పేరు వచ్చింది. కోల్‌కతా స్వాతంత్ర్య సమరయోధులు, మేధావులు మరియు విప్లవకారుల కేంద్రంగా ఉంది. ఇక వారిలో చాలా మంది ఇక్కడికి వచ్చి టీ తాగడం వడలు తినడం చేసే వారు.
ఇప్పటికి కూడా ఇక్కడ వాటికి మంచి క్రేజ్ ఉంది. నేతాజీ జయంతి సందర్భంగా… ఆయన టెలిబజా (వడలు) భరేర్ చా (క్లే కప్పుల్లో టీ) ఆయన ఎక్కువగా తాగేవారు. దాని ఓనర్ కేష్టో కుమార్ గుప్తా జాతీయ మీడియాతో మాట్లాడుతూ… మా తాత స్వాతంత్ర్య సమరయోధులకు సమావేశాలు నిర్వహించేటప్పుడు టిఫిన్ సరఫరా చేసే బాధ్యతను అప్పగించారు అని పేర్కొన్నారు. ఆయన వారికి వరి అన్నం, వేడి వేడి వడలు, పచ్చిమిర్చి మరియు టీలను వార్తాపత్రిక పేపర్లో… టీ బంకమట్టి కప్పులలో ఇచ్చే వారు అని పేర్కొన్నారు. మా తాత ఒకసారి నేతాజీని కలుసుకున్నారు అని తెలిపారు.