తెలంగాణ విద్యా సంవత్సరం క్యాలెండర్ ని విద్యా సంవత్సరం ప్రకటించింది విద్యా శాఖ. 9,10 తరగతుల వారికి విద్యా సంవత్సరం ఫిబ్రవరి 1నుండి ఉండనుంది. వీరికి ఫిబ్రవరి1వ తేదీ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అలానే లాస్ట్ వర్కింగ్ డే 26 మే 2021గా ఉండనుంది. ఇక వేసవి సెలవులు 27.05 2021 నుండి 13.06.2021 వరకు ఇవ్వనున్నారు. అలానే పదో తరగతి వార్షిక పరీక్షలను 17.05.2021 నుండి 26.05 2021 వరకు నిర్వహించనున్నారు.
కరోనా కారణంగా హాజరు శాతం తప్పనిసరి కాదని విద్యాశాఖ ప్రకటించింది. క్యాలెండర్ ప్రకారం ఫిజికల్ క్లాసులలో 89 పనిదినాలు, డిజిటల్ తరగతులు 115 రోజులు ఉండనున్నాయి. మొత్తం మీద 2020 -21 విద్యాసంత్సరానికి గాను 204 పని దినాలు ఉండనున్నాయి. స్కూల్ టైమింగ్స్ గ్రామాలు, పట్టణాల్లో 9.30 నుండి 4.45 వరకు కాగా హైదరాబాద్ లో 8.45 నుండి 4 గంటల వరకు ఉండనున్నాయి. విద్యార్థుల హాజరు పై తల్లి దండ్రుల అనుమతి తప్పని సరి అని ప్రకటించింది విద్యా శాఖ.