వరుసగా గేదెల అనుమాస్పద మృతి.. ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్ !

-

ఒడిశాలోని కేంద్ర పారా జిల్లాలో గత కొద్ది రోజులుగా సుమారు 25 గేదెలు చనిపోయాయి. దీంతో రైతుల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ మరణాలకు ఒక కామన్ వ్యాధి కారణం అని వారు భావిస్తున్నారు. దాని వ్యాప్తిని అరికట్టడానికి తనిఖీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వ్యాధి కేంద్ర పారా జిల్లాలో రాణిపోఖరి, బాలకాటి, నాగపాడ మరియు మరికొన్ని గ్రామాల్లో గుర్తించబడిందని అంటున్నారు.

ఇది జంతువుల మధ్య వ్యాపించే థైలెరియోసిస్ అని అనుమానిస్తున్నారు  అని కేంద్ర పారా యొక్క సబ్ డివిజన్ వెటర్నరీ ఆఫీసర్ ఆశిస్ సతపతి చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని జంతువులకు టీకాలు వేస్తున్నారు. వాటిని దోమతెరలతో కప్పాలని గేదె యజమానులకు సూచించాము అని సతపతి చెబుతున్నారు. అయితే  కొంతమంది రైతులు పరిస్థితిని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సీరియస్ గా లేదని ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news