ఈ సినిమా పరిశ్రమ మొత్తం విచిత్రంగా ఉంటుంది. అలాగే స్క్రీన్ మీద వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను నచ్చాలని లేదు. అవెందుకు నచ్చుతాయి అనేది కూడా మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో హిట్ అయ్యే సినిమాలు ప్లాప్ గా మారతాయి. మరికొన్ని సినిమాలు మెల్లిగా స్టార్ట్ అయ్యి చివరకు ప్రభంజనం సృష్టిస్తాయి.
ఇదే డౌట్ మన హీరో సుదీర్ బాబు కు కూడా వచ్చింది. ఆయన మాట్లాడుతూ రీసెంట్ గా నేను కొన్ని సినిమాలు చూసాను, ప్రతీ రెండు నిముషాలకు ఒక డైలాగు పెట్టామా, నెక్ట్స్ కామెడీ సీన్ పెట్టామా, తర్వాత సాంగ్ వచ్చిందా అంటూ కొంత హంగామా గా సినిమాలు వచ్చాయి. కాని ఆ సినిమాలు మంచిగా ఆడాయి.
కానీ ఓ ఫిల్మ్ మేకర్ గా అవి ఆడటం అనేది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్” అంటూ ఓ ఇంటర్వూలో సుధీర్ బాబు అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవి ఏ సినిమా ని ఉద్దేశించి, ఏ హీరోలను ఉద్దేశించి అనేది ఎవరికి వారు ఊహిస్తున్నారు. ఇది ఎక్కువ మంది రవితేజ సూపర్ హిట్ ధమాకా సినిమా అయ్యి ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.