బిజినెస్ ఐడియా: డిమాండ్ ఎక్కువ వుండే బొట్టుబిల్లలతో లాభాలూ ఎక్కువే..!

-

చాలా మంది వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు ఉద్యోగాలని కూడా కాదనుకొని వ్యాపారాలని మొదలుపెట్టిన వాళ్లు కూడా ఉన్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారా…? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ బిజినెస్ ఐడియా ని చూడాలి.

ఈ బిజినెస్ ఐడియా ద్వారా మంచిగా డబ్బులు వస్తాయి పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అదే బొట్టు బిల్లల బిజినెస్. బొట్టు బిల్లల తయారీ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మహిళలు ప్రతి రోజూ స్టిక్కర్లని వాడుతూ ఉంటారు మీరు ఈ స్టిక్కర్ల ని తయారు చేసి క్యాష్ చేసుకోవచ్చు.

దీని కోసం మీకు ఏమి ఫ్యాక్టరీ అక్కర్లేదు ఎటువంటి కార్యాలయం కూడా అక్కర్లేదు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ వివరాలు మీకు బాగా హెల్ప్ అవుతాయి. అయితే ఈ బిజినెస్ ని మీరు మొదలు పెట్టడానికి కొన్ని మిషన్లు కావాల్సి ఉంటుంది. స్టిక్కర్లు కట్టర్ మెషిన్, ప్రింటింగ్ మిషన్ అవసరం అవుతాయి మాన్యువల్ గా కూడా తయారు చేయొచ్చు. కావాలనుకుంటే బిజినెస్ బాగా డెవలప్ అయిన తర్వాత మిషన్స్ ని కొనుగోలు చేయొచ్చు.

ఈ బిజినెస్ ని ప్రారంభించడానికి పది వేల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీ చుట్టూ వుండే  షాఫ్యాన్సీప్స్ లో మీరు అమ్మొచ్చు. ఎరుపు రంగులో స్టిక్కర్లని మీరు మొదటి తయారు చేయొచ్చు కావాలనుకుంటే మీరు కలర్స్ కూడా చేయొచ్చు ఇలా ఈ బిజినెస్ ద్వారా 50 వేల నుండి 60 వేల రూపాయలు వరకు సంపాదించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news