Sridevi Soda Center: ఒకప్పుడు కొత్త సినిమాలు చూడాలంటే.. కచ్చితంగా థియేటర్స్ వెళ్లాల్సిందే.. ! లేదు టీవీలోనే చూద్దాలేండీ అనుకుంటే… కనీసం ఆరునెలలు అయినా ఆగాల్సిందే.. ఇక బడా హీరోల సినిమాలు అయితే.. దాదాపు ఏడాది సమయం పట్టేది. ఇప్పుడూ ఆ టైం మారింది. ఏ సినిమా అయినా.. నెల నుంచి రెండు నెలల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావాల్సిందే.. బ్లాక్ బాస్టర్ హీట్ అయినా.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కూడా కేవలం నెలలోపే అమెజాన్ ప్రైమ్ లో వచ్చేసింది. ఇప్పుడు ఇదే బాటలో ఓటీటీలో వచ్చేందుకు శ్రీదేవి సోడా సెంటర్ కూడా సిద్ధమైంది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఒకటి. వెండితెరపై మెరిసిన ఈ చిత్రం ఇప్పుడు.. ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది. అది ఎప్పుడంటే.. నవంబరు 4 నుంచి లో ఓటీటీలో ప్రత్యేక్షం కానునంది. ఈ క్రమంలో ఆ సినిమా మూవీమేకర్స్ పోస్టర్‌ని విడుదల చేసింది.‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రంలో సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించారు. ఈచిత్రానికి ‘పలాస 1978’ ఫేం కరుణ కుమార్ దర్శకత్వం వహించగా.. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఈచిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.
పరువు హత్యల నేపథ్యంలో.. ఓ తండ్రి తన పరువు కోసం.. ఎంతంటి దారుణానికి ఒడిగట్టారు? ప్రేమకి కులం అడ్డుగా నిలిస్తే.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. తన కులం కాని అమ్మాయిని ప్రేమిస్తే.. సమాజం ఎలా చూస్తుంది. అనే కథాంశంతో తెరకెక్కించారు. తెలుగులో వచ్చిన గొప్ప సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ అని విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించారు. ఇప్పుడీ సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది.