పోడు భూములపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం..!

పోడు భూముల సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ నేడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్ష సమావేశం లో అన్ని జిల్లాల కలెక్టర్ లు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు హాజరుకానున్నారు. అంతే కాకుండా పలువురు ముఖ్య అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. 11:30 నిమిషాలకు ప్రగతి భవన్ లో ఈ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

KCR-TRS
KCR-TRS

పోడు భూముల ఆక్రమణలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే ములుగు లో పోడు భూములు ఎక్కడెక్కడ సాగు చేస్తున్నారు అనే దానిపై అధికారులు ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ తో అధికారులు ఈ సర్వే నిర్వహించారు. దీనికి సంభందించిన నివేదికను సీఎం కు అందజేస్తారు. 2005 తరవాత పోడు భూములను మళ్లీ క్రమబద్ధీకరిస్తే జరిగే నష్టం…పర్యావరణ నిపుణులు వాదనలు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.