ఆ డైరెక్టర్​ ఇంటికి వార్డెన్​గా సుహాస్!​.. కట్​ చేస్తే ఆయనతోనే సినిమా.. ఇప్పుడు జాతీయ స్థాయిలో..

-

తొలి ప్రయత్నంలోనే హృదయాలను హత్తుకునేలా ‘కలర్​ఫొటో’లాంటి చక్కటి ప్రేమకథతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు సందీప్​, హీరో సుహాస్​. ఇటీవలే ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసిన ఈ ఇద్దరూ తమ కెరీర్​లో ఎదుర్కొన్న సమస్యలు, జరిగిన ఆసక్తికర సంగతులను తెలిపారు. ఆ విశేషాలివీ..

మీమ్స్​ నుంచి మూవీస్​కు.. 2015లో చాయ్​ బిస్కెట్​తో ఇద్దరం కెరీర్​ మొదలుపెట్టి దాన్ని యూట్యూబ్​ ఛానల్​గా మార్చాం. ఈ క్రమంలోనే మీమ్స్​ను రూపొందించేవాళ్లం. ఆ తర్వాత షార్ట్​ ఫిల్మ్స్​ చేశాం. అక్కడ పేరు రావడం వల్ల సినిమాల్లో ఛాన్స్​ వచ్చింది. 2019లో ధైర్యం చేసి సొంతంగా సినిమా చేశాం.

93 మందికి రిజెక్ట్.. ‘కలర్​ ఫొటో’ స్టోరీని 93 మందికి చెప్పినట్లు తెలిపారు సందీప్​. “చాలా మందికి ఈ కథలో మార్కెట్​ కనపడలేదు. చాలా మంది హీరోగా సుహాస్ ఎందుకు, హీరోయిన్​గా చాందిని ఎందుకు అంటూ చీప్​గా చూశారు. ​అలా ఈ కారణాలతో అంతమంది రిజెక్ట్​ చేశారు. అయినా ఎట్టకేలకు సినిమా స్టార్​ చేశాం. ఇంకో నెలలో షూట్​ చేద్దాం అనుకున్న సమయంలో ఓ క్యారెక్టర్​ కోసం సునీల్​ గారిని ఓకే చేశాం.

వార్డన్​గా.. సందీప్‌ రాజ్‌ మాట్లాడుతూ.. సుహాస్​కు రాత్రి 10:00 గం.లు ఎందుకు ప్రత్యేకమో చెప్పుకొచ్చారు. “సుహాస్​కు రాత్రి పది గంటలకే నిద్రపోయే అలవాటు ఉంది. న్యూజివీడులో షూటింగ్ జరిగేటప్పుడు కూడా అంతే తొందరగా పడుకునేవాడు. సీన్స్​ కోసం రాత్రి పూట అతడిని కలిస్తే.. ఫ్రస్టేషన్​ తెప్పించేవాడు. అస్సలు వీడు ఎందుకు ఫ్రెండ్ అయ్యాడో అని అనుకునేవాడిని. ఇక పొద్దున ఆరింటికే లేస్తాడు. కారు వేసుకుని వచ్చేస్తాడు. టీ తాగొద్దాం అంటాడు. ‘రా రా’ అంటూ ఇంటి కిందే వెయిట్​ చేస్తుంటాడు. ఇక దాంతో అతడిని మా ఇంటి వార్డెన్​ అనేవాడిని. అతడి కాంటాక్ట్​ నెంబరును వార్డెన్​గా సేవ్​ చేసుకున్నా” అని అన్నారు.

ఎమోషనల్​ అయిపోయాం..

సందీప్​: హీరో సూర్యగారికి అవార్డు వస్తుందని టీవీ చూస్తున్నాను. కలర్​ఫొటోకు నేషనల్​ అవార్డు వచ్చిందని అనౌన్స్ చేశారు. డైరెక్టర్​ సందీప్​ రాజ్​ అని పేరు చెప్పడంతో ఎగిరి గంతేశాను. ఆనందంతో సుహాస్​కు కాల్​ చేసి, ఆఫీస్​కు వెళ్లి అందరికీ చెప్పేశాను. కన్నీళ్లు ఆగలేదు.

సుహాస్​: 2 శాతం ఛార్జింగ్​ ఉంది. అస్సలు ఊహించలేదు. అవార్డు వచ్చిందని సందీప్​ ఏడుస్తూ చెప్పాడు. ఆ సమయంలో ఇద్దరికీ కన్నీళ్లు ఆగలేదు.

డైరెక్టర్​ అలా అవ్వాలనిపించింది.. తాను ఎందుకు డైరెక్టర్​ అవ్వాలనుకున్నారో చెప్పారు సందీప్​. “రాజమౌళి అంటే స్ఫూర్తి. ఛత్రపతి సినిమా చూసినప్పుడు డైరెక్టర్​ అనే వారు ఉంటారని తెలుసుకున్నాను. అప్పడు ఆయనకు అభిమానిని అయ్యాను. ‘ఈగ’ సినిమాకు వీరాభిమానిగా మారిపోయా. అప్పటి నుంచి డైరక్షన్​ డిపార్ట్​మెంట్​పై ఫోకస్​ పెట్టాను. సాధారణంగా రైటర్​ అయినప్పటికీ మొదట విలన్​ అవ్వాలనుకున్నాను” అని అన్నారు.

ఆకలి విలువ అప్పుడే తెలిసింది: ఇక కెరీర్​ ప్రారంభంలో తాను ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు హీరో సుహాస్​. డబ్బులు ఎవరినీ అడగాలో తెలియక పస్తున్న ఉన్నట్లు చెప్పుకొచ్చారు! “మా అన్నయ్య ఫ్రెండ్స్​ ఇద్దురు ఉన్నారు. ఒక రోజు నా రూమ్​కు వచ్చి రూ.500 ఉంచుకో అంటూ ఇచ్చారు. ఎందుకో తెలీదు అప్పుడు బాగా ఏడ్పు వచ్చేసింది. ఇంట్లో అన్నం పెట్టినప్పుడు సరిగ్గా తినేవాడిని కాదు. కానీ ఇక్కడి వచ్చాక అన్నం విలువ తెలిసింది. చేతులో డబ్బులు ఉండవు. ఎవరినీ అడగలేము. ఆకలితో అలానే ఉండాలి. ఆ సమయంలో వాళ్లు డబ్బులు ఇవ్వడం వల్ల బాగా ఎమోషనల్​ అయిపోయా” అని అన్నారు.

సీక్రెట్​ చెప్పిన చాందిని.. ఇక ఇదే కార్యక్రమంలో వీడియో ద్వారా ‘కలర్​ఫొటో’ ద్వారా చాందిని కనిపించి ఓ సీక్రెట్​ అని చెప్పారు. కలర్​ఫొటోలో అలీ కోసం ఓ పాత్ర రాశారని, కానీ దర్శకుడు సందీప్​ ఎందుకు సంప్రదించలేదో తెలుసుకోవాలని అన్నారు.

అయితే అప్పుడు బడ్జెట్​, రెమ్యునరేషన్​ కారణంగా అలీని సంప్రదించలేదని సందీప్​ సమాధానమిచ్చారు. అయితే దీనిపై అలీ మాట్లాడుతూ.. మంచి కథ, పాత్ర ఉంటే డబ్బు కోసం యాక్టర్లు ఆలోచించరని చెప్పారు. తాను కూడా కలర్​ఫొటోలో నటించి ఉంటే బాగుండేదని అన్నారు. కాబట్టి చిన్న డైరెక్టర్లు ఎప్పుడూ మంచి కథ, పాత్ర ఉన్నప్పుడు బడ్జెట్​, రెమ్యునరేషన్​ గురించి ఆలోచించకుండా యాక్టర్లను సంప్రదించాలని, నటులు తప్పకుండా నటిస్తారని సూచించారు. జంజాల, ఈవీవీ సత్యనారాయణం, ఎస్వీ కృష్ణారెడ్డి, రేలంగి నరసింహరావు తనకు ఇష్టమైన కామెడీ డైరెక్టర్లు అని చెప్పారు. డెరెక్టర్​ భారతీరాజా తన ఎదుగదలకి కారణమని చెప్పారు.తన స్ఫూర్తి సీనియర్​ హాస్యనటుడు రాజబాబు అని చెబుతూ.. తామిద్దరు కలిసి నటించిన సినిమాలను గుర్తుచేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news