భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కానిస్టేబుల్, ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీహరికోటలో మరో విషాదం చోటుచేసుకుంది. సీఐఎస్‌ఎఫ్ సీఐ వికాస్‌సింగ్ సతీమణి ఆత్మహత్య చేసుకున్నారు.
నర్మద గెస్ట్ హౌస్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న తుపాకీతో కాల్చుకొని వికాస్‌సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మృతి విషయం తెలుసుకొని ఆమె.. నిన్న తన అన్నతో కలిసి శ్రీహరికోటకు వచ్చారు. భర్త వికాస్‌సింగ్ మృతిని తట్టుకోలేకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
సబ్ ఇన్‌స్పెక్టర్ వికాస్ సింగ్‌కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో కుమారుడు ఒకటో తరగతి, కుమార్తె ఎల్‌కేజీ, మరో కుమార్తె చిన్నపాప. ఇందులో ఓ కుమార్తె వికలాంగురాలు. ఇతని మృతిపైనా అనుమానాలున్నాయి.