వాటే స్కీమ్.. సంవత్సరానికి రూ.20 కడితే…రూ.2 లక్షల బెనిఫిట్..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని తీసుకు వస్తూనే వుంది. ఈ స్కీముల వలన చాలా మందికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. సామాజిక భద్రతకు సంబంధించిన పథకాలు కూడా వీటిలో వున్నాయి. కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ వలన చక్కటి లాభాలని పొందేందుకు అవుతుంది.

ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలని చూస్తే… రూ. 20 మొత్తంతో రూ. 2 లక్షల దాకా ప్రయోజనం పొందొచ్చు. మన దేశం లోని పేదలకు ఈ స్కీమ్ వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రూ. 20 కనీస ప్రీమియంతో రూ. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ని పొందవచ్చు. ఈ స్కీమ్ ని తెరవడానికి బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి ఓపెన్ చేసేయచ్చు.

ఇన్సూరెన్స్ ఏజెంట్ల ద్వారా కూడా దీన్ని పొందవచ్చు. ఇందులో చేరిన వారు సంవత్సరానికి రూ.20 ప్రీమియం చెల్లించాల్సి వుంది. బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేస్తే ఆటోమేటిక్ గా కట్ అవుతాయి. మే 31న ఈ డబ్బులు బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవ్వచ్చు. కనుక డబ్బులు ఉండేలా చూడండి.

ఒకవేళ కనుక బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేవంటే పాలసీ ఆగిపోతుంది. ప్రీమియం డబ్బులు చెల్లిస్తేనే పాలసీ రెన్యూవల్ అవుతుందట. చూసుకోండి. 18 నుంచి 70 ఏళ్ల వాళ్ళు ఈ పాలసీ ని తీసుకోవచ్చు. పాలసీదారుడు ప్రమాదవ శాత్తు మరణిస్తే రెండు లక్షలు వారి కుటుంబానికి వస్తాయి. అదే శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ. లక్ష చెల్లిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news