పవన్ కళ్యాణ్ “OG” మూవీ నుండి కిర్రాక్ అప్డేట్!

-

పవన్ కళ్యాణ్ కుర్ర హీరోలకన్నా ఫాస్ట్ గా ఏకకాలంలో చాలా సినిమాలను షూటింగ్ చేస్తూ బిజీ గా ఉన్నాడు. ఒకవైపు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు OG సినిమాల షూటింగ్ లతో బిజీ షెడ్యూల్ లో ఉన్నాడు. ఎన్నికలకు ముందు ఈ మూడు సినిమాలను ఫినిష్ చేసే టార్గెట్ ను పెట్టుకుని ముందుకు వెళుతున్నాడు. కాగా సాహో సినిమా దర్శకుడి సుజిత్ తెరకెక్కిస్తున్న OG లో ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ నుండి ఒక ఇంటెరెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ రోజు విజయదశమి మరియు ఆయుధపూజల సందర్భంగా ఫ్యాన్స్ కు పండుగ శుభాకాంక్షలను తెలుపుతూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ క్లాసిక్ లుక్ లో అదరగొట్టేశాడు అని చెప్పాలి. ఇంతకు ముందే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది.

ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ఇంకా రిలీజ్ పై ఒక క్లారిటీ రాలేదు, అప్పటి వరకు చిన్న చిన్న అప్డేట్స్ ను చూస్తూ గడిపేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news