మీ చేతికి రూ.5 లక్షలు..! ఎలా అంటే..?

Join Our COmmunity

మీకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారా? అయితే ఇది మీకు గుడ్ న్యూస్..! ఇప్పుడు దీనిని కనుక అనుసరిస్తే మీరు ఎంతో సులువుగా డబ్బులు దాచి పెట్టొచ్చు. మరి వివరాల్లోకి వెళితే… కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ను తీసుకు రావడం జరిగింది. దీని ద్వారా మీ చేతికి కొన్ని లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే… ఆడ పిల్లలు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. ఒక ఇంట్లో ఇద్దరు అమ్మయిల పేరు పై సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చు.

మీరు కనుక ఈ సుకన్య సమృద్ధి అకౌంట్‌లో చేరాలంటే కచ్చితంగా 10 ఏళ్ల లోపలే వయసు ఉండాలి. ఇక ఈ స్కీమ్‌ వివరాలని చూస్తే… ఈ స్కీమ్‌ కోసం మీరు నెలకు రూ.1000 నుంచి కూడా డబ్బులని కట్టవచ్చు. ఇలా మీకు తోచినంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ రావొచ్చు.. మీరు ఇలా 15 ఏళ్ల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా మీరు ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ ‌లో గరిష్టంగా నెలకు రూ.12,500 వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. దీనితో పాటు మీకు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అమ్మాయికి 18 ఏళ్ల దాటిన తర్వాత కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.

ఇక సుకన్య సమృద్ధి స్కీమ్ మెచ్యూరిటీ కాలం వచ్చేసి 21 ఏళ్లు. మీరు ఖాతా తెరిచిన 21 ఏళ్ల తర్వాత డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు గమనించండి. ప్రస్తుతం దీని పై 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. మీరు కనుక ఈ స్కీమ్‌ లో నెలకు రూ.1000 ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మెచ్యూరిటీ కాలం లో రూ.5.27 లక్షలు మీ చేతికి వస్తాయి.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news