సాయి పల్లవి ఓ లేడి పవన్ కళ్యాణ్ : సుకుమార్

-

హీరోయిన్‌ సాయి పల్లవి ఓ లేడీ పవన్‌ కళ్యాణ్‌ అని టాలీవుడ్‌ దర్శకుడు సుకుమార్‌ పేర్కొన్నారు. నిన్న అడవాళ్లు మీకు జోహార్లు.. సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుకుమార్‌, సాయి పల్ల, కీర్తి సురేష్‌ తదితరులు హజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ.. హీరోయిన్‌ రష్మిక, కీర్తి సురేష్, సమంత, సాయి పల్లవి ఈ నలుగురు ది బెస్ట్‌ ఫర్‌ ఫామెన్స్‌ ఇచ్చే హీరోయిన్లు అని ఆయన వివరించారు. అందులో సాయి పల్లవి క్రేజ్‌ చూస్తుంటే.. ఆమె లేడీ పవన్‌ కళ్యాణ్‌ లా అనిపిస్తోందని సుకుమార్‌ చెప్పారు.

సాయి పల్లవి.. గొప్ప ప్రతిభ, మంచి వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్‌ అని కొనియాడారు. గతంలో ఆమె ఓ వాణిజ్య ప్రకటన తిరస్కరించి.. అందరికీ ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు సుకుమార్‌. ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ మంచి విజయం సాధిస్తుందన్నారు. ఈ సినిమా పూర్తిగా ఫ్యామీలీ ఎంటరైనర్‌ అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news