ప్రకాశం : ఓ చెక్ బౌన్స్ కేసులో మార్కాపురం కోర్టుకు సినీ హీరో సుమంత్, ఆయన సోదరి సుప్రియ హాజరయ్యారు. నరుడా డో నరుడా చిత్రానికి నిర్మాతగా సుమంత్ సోదరి సుప్రియ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… మాచర్ల కు చెందిన కారుమంచి శ్రీనివాసరావు అనే వ్యక్తి నుండి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు సుప్రియ.
అయితే… నగదు కు ష్యురిటీ గా సుమంత్, సు ప్రియల జాయింట్ అకౌంట్ చెక్కు ను అంద జేశారు. అయితే… సమయానికి నగదు ఇవ్వక పోవడం తో చెక్కును బ్యాంకులో వేశారు కారుమంచి శ్రీనివాస రావు. ఆ అకౌంట్ లో నగదు లేక పోవడంతో… చెక్ బౌన్స్ అయింది. దీంతో మార్కా పురం కోర్టులో… వారిపై కేసు వేశారు శ్రీనివాసరావు. ఈ కేసులో భాగం గానే… విచారణ నిమిత్తం కోర్టులో హాజరయ్యారు హీరో సుమంత్, నిర్మాత సుప్రియలు. అయితే.. వీరిద్దరూ కోర్టు వెళ్లిన ఫోటోలు వైరల్ గా మారాయి.