తెలంగాణ భ‌వ‌న్ లో కేసీఆర్ స‌మావేశం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సీఎం, టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న.. ఆ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం ప్రారంభం అయింది. ఈ విస్తృత స్థాయి స‌మావేశం… తెలంగాణ భ‌వ‌న్ లో జ‌రుగుతోంది. ఇక ఈ స‌మావేశంలో… టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ, కార్పోరేష‌న్ చైర్మ‌న్లు పాల్గొన్నారు.

అలాగే… జిల్లా రైతుబంధు క‌మిటీ చైర్మ‌న్లు, రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌కు కూడా ఆహ్వానం అందింది. దీంతో వారంతా… ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. అయితే.. ఈ స‌మావేశంలో ముఖ్యంగా యాసంగి పంట‌ల‌పై చ‌ర్చించే ఛాన్స్ ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది. అలాగే.. రైతు బంధు ప‌థకం అమ‌లు, ధాన్యం కోనుగోళ్లు, బీజేపీ పార్టీ పై ఎలాంటి కార్యాచ‌ర‌ణ తో ముందుకు వెళ్లాల‌నే దానిపై ఈ స‌మావేశంలో సీఎం కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు. కాగా.. గ‌త కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య ధాన్యం కొనుగోళ్ల విష‌యంపై వివాదం చెల‌రేగుతున్న సంగ‌తి తెలిసిందే.