ఆర్టీసీ క్రాస్ రోడ్డులో అల్లు అర్జున్ సందడి….ఫ్యామిలీతో పుష్ఫ మూవీకి…

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ పుష్ప ఈరోజు దేశవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప తెలుగు, హిందీ, తమిళ్, మళయాళ, కన్నడ భాషల్లో పెద్ద ఎత్తున రీలీజ్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప మూవీపై ఆడియన్స్ లో అంచానాలు పెరిగాయి. ఊర మాస్ గెటప్ లో ఎర్ర చందనం స్మగ్లర్ రోల్ లో బన్నీ కనిపించనున్నారు. దీంతో పాటు మళయాళ స్టార్ ఫహాద్ పాజిల్ ఈ సినిమాలో నటిస్తుండటంతో క్రేజీ బజ్ క్రియేట్ అయింది. తాజాగా ఈ రోజు పుష్ప రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది.

తాజాగా పుష్ఫ సినిమా రిలీజ్ నేపథ్యంలో అల్లు అర్జున్ సందడి చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో అభిమానులతో సినిమాను వీక్షించారు. సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ రాకతో సందడి నెలకొంది. ఫ్యామిలీతో వచ్చిన బన్నీని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. అభిమానులు బన్నీతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.