యంగ్ హీరో సుమంత్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించి అలరించిన విషయం తెలిసిందే. అయితే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంత మంచి గుర్తింపు అయితే సొంతం చేసుకున్నారో అంతే త్వరగా ఇండస్ట్రీకి కనుమరుగయ్యారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ తన మార్కును అలాగే కొనసాగిస్తున్నారు సుమంత్. ఇక ప్రముఖ హీరోయిన్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్న సుమంత్ అతి తక్కువ సమయంలోనే ఆమెకు విడాకులు ఇచ్చి పూర్తిగా వైవాహిక జీవితానికి దూరం అయ్యాడు. అంతేకాదు రెండో వివాహం అనే ఊసు లేకుండా ఆయన సంతోషంగా తన సినిమాలలో.. వ్యాపార సామ్రాజ్యంలో బిజీ అయిపోయారని చెప్పవచ్చు..
తాజాగా సుమంత్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం కింగ్ నాగార్జున అనే విషయం వైరల్ అవుతుంది.. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, కింగ్ నాగార్జున మేనల్లుడిగా సుమంత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక సుమంత్ తండ్రి యార్లగడ్డ ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ ..సుమంత్ తన మొదటి సినిమా కూడా స్టార్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేతుల మీదుగా తెరకెక్కింది. ఇక ఈయనకు సినీ బ్యాగ్రౌండ్ ఎక్కువగా ఉండడంతో చాలామంది మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారికి గట్టి పోటీ ఇస్తారని భావించారు. కానీ అనుకోకుండా ఆయన సినీ ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు. ఇక సుమంత్ మొదటి సినిమా ప్రేమ కథకు నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సుమంత్ తన తాత అక్కినేని నాగేశ్వరరావు తో, మేనమామ నాగార్జునతో కలిసి సినిమాలు చేసి నా కెరియర్ నాశనం చేసుకున్నాను అని స్వయంగా తెలిపారు. నాగార్జునతో స్నేహం అంటే ఇదేరా సినిమాలో కలిసి నటించడంతో వీరిని ఫ్రెండ్స్ గా అభిమానులు అంగీకరించలేకపోయారు. దాంతో ఆయనకు సినిమాలో అవకాశాలు రావడం ఆగిపోయాయి. అలా నాగార్జున వల్ల సుమంత్ కెరియర్ నాశనం అయ్యింది.