తెలంగాణ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త..

-

తెలంగాణ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇకపై ఏసీ బస్సు చార్జీలను 10 శాతం తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. వర్షాకాలం కావడంతో పాటు శుభకార్యాలు కూడా లేకపోవడంతో ప్రయాణికుల సంఖ్య తగ్గింది.

దాంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి పరోక్షంగా ఏపీఎస్ఆర్టీసీనే కారణమని చెప్పొచ్చు. హైదరాబాద్ కేంద్రంగా ఎక్కువ సర్వీసులు ఆంధ్ర వైపే నడుస్తుంటాయి.

ఈ క్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఇటీవల ఏసీ బస్సుల్లో టికెట్ ధరలను తగ్గించింది. దాంతో ప్రయాణికులు టిఎస్ఆర్టిసి బస్సులు కంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. చార్జీల్లో వ్యత్యాసం ఉండటంతో టిఎస్ఆర్టిసిల్లో ఆక్యుపేన్సీ రేషియో బాగా పడిపోయింది. దాంతో ప్రయాణికులను మళ్లీ టిఎస్ఆర్టిసి వైపు తిప్పుకునేందుకు టికెట్ చార్జీలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news