గుండ్లకమ్మ ప్రాజెక్టు పాపం టిడిపి దే – అంబటి రాంబాబు

-

ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. బుధవారం రాత్రి ప్రాజెక్టుకు వచ్చిన భారీ వరదతో మూడో గేటు కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు నుంచి రెండో రోజు శుక్రవారం కూడా నీరు వృధాగా పోతుంది. దీంతో స్టాప్ లాక్ ద్వారా నీటిని ఆపేందుకు ఇంజనీర్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. 13, 14 ,15 గేట్లు ఎత్తి ప్రాజెక్టులో నీటి ఒత్తిడిని అధికారులు తగ్గిస్తున్నారు. ఇప్పటికే 12000 క్యూసెక్కుల నీరు సముద్రం పాలైంది. కాగా ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గడంతో రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ప్రాజెక్టు గేట్లు లోపలికి కూరుకుపోవడం వల్ల వాటర్ లీక్ అవుతున్నట్లు గుర్తించామన్నారు. రెండు గేట్లు లాక్ అవ్వడంతో.. ప్రత్యామ్నాయంగా రెండు గేట్లు అమర్చామని అన్నారు. త్వరగా గేట్లను బాగు చేసి.. నాగార్జునసాగర్ నీటితో రిజర్వాయర్ ను నింపుతామని తెలిపారు. ఈ విషయంలో కొందరు కావాలని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని.. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు విరగడానికి గత ప్రభుత్వమే కారణమని విమర్శించారు. గేటు మనమ్మత్తులను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news