తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ఉండనున్నాయి. సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు, వేసవి సెలవులపై విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు అంటే దాదాపు 48 రోజులు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి రెండో వారం నుంచి ఒంటిపూట తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news