వేసవి కాలంలో రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి చెమట కాయలు మొదలు డీహైడ్రేషన్ ఇలా చాలా సమస్యలు ఉంటాయి. వేసవి కాలంలో చెమటకాయలని తగ్గించుకోవాలంటే ఇలా చేయండి. వేసవికాలం వచ్చిందంటే మొదట మనల్ని చెమటకాయలు బాగా ఇబ్బంది పెడతాయి. వేడి పెరగడం వలన చెమటకాయలు వస్తాయి అయితే ఈ సమస్య నుండి దూరం అవ్వాలంటే ఇలా చేయండి ఇలా చేస్తే చెమటకాయల బాధ నుండి బయటపడచ్చు. ముఖం, మెడ, ఛాతి భాగంలో చెమట కాయలు ఎక్కువ వస్తాయి.
చెమట ఏర్పడినప్పుడు వచ్చే బ్యాక్టీరియా డెడ్ స్కిన్ సెల్స్ తో చెమట గ్రంధులని మూసివేస్తాయి దాంతో చెమటకాయలు సమస్య వస్తుంది. నీళ్లు తాగితే ఉపశమనంగా ఉంటుంది. ఎక్కువ నీళ్లు తాగితే చెమట కాయల బాధ నుండి బయటపడొచ్చు. గాలి తగిలేలా ఉండాలి. కాటన్ దుస్తులు వేసుకోవడం వంటివి చేస్తే కూడా చెమటకాయల బాధ ఉండదు చెమట కాయలు ఉన్న ప్రదేశంలో చల్లని పెరుగుని రాసుకుంటే కూడా ఉపశమనం లభిస్తుంది. చల్లటి నీటితో తర్వాత కడిగేసుకుంటే చెమటకాయలు పూర్తిగా తగ్గిపోతాయి.
ముల్తానీ మట్టి కూడా బాగా పనిచేస్తుంది. ముల్తానీ మట్టి కూడా చెమట కాయల బాధ నుండి బయట పడేస్తుంది. రోజ్ వాటర్ తో కూడా ఈ సమస్యకి చెక్ పెట్టొచ్చు తేనే, మంచినీరు, రోజ్ వాటర్ ని కలిపి రిఫ్రిజిరేటర్ లో ఉంచండి ఇప్పుడు క్యూబ్స్ మాదిరి తయారవుతాయి కదా ఆ క్యూబ్స్ మీరు చెమటకాయలు ఉన్నచోట రాస్తే చెమటకాయలు సమస్య నుండి బయట పడొచ్చు. గంధం కూడా బాగా పని చేస్తుంది గంధం లో కొన్ని పాలు పోసి చెమటకాయలు ఉన్న ప్రదేశంలో రాస్తే చెమట కాయల నుండి బయటపడొచ్చు. ఎక్కువ నీరు తాగడం చర్మాన్ని పొడిగా ఉంచుకోవడం వేసుకోవడంతో చెమటకాయలు రాకుండా ఉండొచ్చు.