గాంధేయవాది, ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సుందర్‌లాల్ బహుగుణ కరోనాతో ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. . చెట్టు, పర్యావరణం, మానవ సమాజం అంటూ అందరికీ అర్థమయ్యే రీతిలో చిప్కో ఉద్యమాన్ని చేపట్టారు ఆయన. భార్యకు వచ్చిన ఆలోచనతో ఆయన ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మొదట 1970 లలో చిప్కో ఉద్యమంలో సభ్యుడిగా, తరువాత 1980 ల నుండి 2004 ప్రారంభం వరకు టెహ్రీ ఆనకట్ట వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు ఆయన.
1927 జనవరి 9 న ఉత్తరాఖండ్ లోని తెహ్రీ సమీపంలో మరోదా అనే గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారు. సత్యాగ్రహ పద్దతిలోనే ఆయన ఉద్యమాలు అన్నీ ఉండేవి. ఆయన మరణం పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.