ఆ రాష్ట్రంలో పశువులకు ఆదివారం సెలవు..100 ఏళ్లుగా అదే తంతు.. కారణం?

-

మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆదివారం సెలవు ఉంటుంది..పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ఇతర ప్రైవేట్ సంస్థలు ఆదివారాలు సెలవులు. వారానికో సెలవుతో ప్రజలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని సెలవు దినం ప్రకటించారు..ఒకరోజు రెస్ట్ ఉంటే తర్వాత మళ్ళీ పనిలోకి వస్తే చురుగ్గా ఉంటారని సంస్థలు భావిస్తున్నారు..ఇకపోతే మనుషులకు సెలవు ఉండటం వినే ఉంటాము కానీ, జంతువులకు ఆదివారం సెలవు ఉండటం ఎక్కడా విని ఉండరు..కానీ ఓ దేశంలో పశు, పక్షులకు ఆదివారం సెలవు ఉంది.. ఇంతకీ ఆ దేశం ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జార్ఖండ్‌ రాష్ట్రంలో మనుషులకే కాదు జంతువులకు కూడా వారంలో ఒక రోజు సెలవు ఇవ్వబడుతుంది. అంటే ఆదివారం పశువులకు సెలవు ఇస్తారు. ఈ రోజు పశువులకు మేత మాత్రమే ఇస్తారు. ఎటువంటి పని చేయించరు. మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా విశ్రాంతి అవసరమని స్థానికులు నమ్మకం. అందుకే తమ పశువులకు ఒకరోజు సెలవు కూడా ఇస్తున్నారు..జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో పశువులకు ఒక రోజు సెలవు ఇచ్చే సంప్రదాయం ఉంది. జిల్లాలోని దాదాపు 20 గ్రామాల ప్రజలు గత 100 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.

ఈ గ్రామాల్లో ఆదివారాల్లో ఎద్దులు, ఇతర పశువులతో ఎలాంటి పని చేయించరు. పశువులకు ఆదివారం పూర్తి విశ్రాంతి ఇస్తారు. జిల్లాలోని హర్ఖా, మోంగర్, పరార్, లాల్‌గాడి సహా 20 గ్రామాల ప్రజలు తమ పశువులతో ఆదివారం పని చేయరు. ఆ రోజు పూర్తిగా పశువులకు కావాల్సిన మేత, పచ్చ గడ్డిని ఆహారంగా ఇస్తారు.. పశువులకు విశ్రాంతి ఇచ్చే సాంప్రదాయం 100 ఏళ్లకు పైగా సాగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.. నిజానికి.. వందేళ్ల క్రితం ఓ ఎద్దు పొలంలో దున్నుతున్న సమయంలో కింద పడి చనిపోయిందట..అప్పుడు ప్రజలు ఎద్దు అధిక పని కారణంగా అలసిపోయిందని, దీని కారణంగా ఎద్దు చనిపోయిందని భావించారు. దీంతో గ్రామస్తులు కలిసి వారంలో ఒక రోజు పశువులకు విశ్రాంతి కల్పించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఆదివారాల్లో పశువులకు సెలవు ఇచ్చే సంప్రదాయం పాటిస్తున్నారు… ఇప్పటికి ఆ రాష్ట్రంలో ఇదే తంతు కొనసాగడం విశేషం.. గ్రేట్ ఐడియా కదా..

Read more RELATED
Recommended to you

Exit mobile version