అయోధ్య తీర్పుపై సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌ సమావేశంలో కీలక నిర్ణయం..

-

చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య భూ వివాదంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయొద్దని నిర్ణయించింది. వాస్త‌వానికి సుప్రీంకోర్టు తీర్పు పట్ల తీవ్ర సున్నీ వక్ఫ్ బోర్డు మొదట్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

అయితే, సీజేఐ తీర్పు వెల్లడించగానే రివ్యూకు వెళ్తామని సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌ తరపు న్యాయవాది ప్రకటించారు. అయితే సుప్రీంతీర్పును పూర్తిస్థాయిలో పరిశీలించిన వక్ఫ్‌ బోర్డ్‌ ఈ నిర్ణయానికి వచ్చింది. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీం ఇచ్చిన ఐదు ఎకరాల భూమి మాకు అత్యంత ముఖ్యమైనది కాదన్నారు. తీర్పులో అనేక అంశాలు ఉన్నాయన్నారు. శాంతి నెలకొనాలని అంతా కోరుకుంటున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news