కేన్ మామకు బిగ్‌ షాక్, SRH నుంచి ఔట్?

-

కేన్ మామకు బిగ్‌ షాక్. పాక్ పై ఓటమి బాధలో ఉన్న కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ కు SRH షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్ కోసం అతన్ని రిటైన్ చేసుకోకుండా వేలంలోకి విడుదల చేయాలని యాజమాన్యం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ లో కెప్టెన్ గా ఆటగాడిగా అతను పూర్తిగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్లలో 6 మాత్రమే గెలిపించగలిగాడు. బ్యాటింగ్ లో 19.63 సగటుతో 216 పరుగులే చేశాడు.

కేన్‌ మామతో పాటు రొమారియో షెప్పర్డ్, జగదీశ సుచిత్, కార్తీక్ త్యాగి, సీన్ అబాట్, శశాంక్ సింగ్, ఫజహక్ ఫారూఖీ, శ్రేయస్ గోపాల్‌ను మినీ వేలం పాట కోసం విడుదల చేయొచ్చని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news