స‌న్‌రైజ‌ర్స్‌కు షాక్‌.. ఐపీఎల్ కు కీల‌క బౌల‌ర్ దూరం..

-

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌ను చేజేతులా పోగొట్టుకున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. హైద‌రాబాద్ ప్లేయ‌ర్ మిచెల్ మార్ష్ గాయం కార‌ణంగా ఐపీఎల్ 13వ ఎడిష‌న్ నుంచి పూర్తిగా త‌ప్పుకున్నాడు. దీంతో అత‌ని స్థానంలో వెస్టిండీస్ టెస్ట్ జ‌ట్టు కెప్టెన్ జేస‌న్ హోల్డ‌ర్ రానున్నాడు. ఈ మేర‌కు హైద‌రాబాద్ జ‌ట్టు జేస‌న్ హోల్డ‌ర్ పేరును ప్ర‌క‌టించింది.

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీంతో జ‌రిగిన మ్యాచ్‌లో 5వ ఓవ‌ర్‌ను మిచెల్ మార్ష్ బౌల్ చేశాడు. అందులో భాగంగా ఆ ఓవ‌ర్‌లో అత‌ను 4 బంతులు విసిరాడు. 5 బంతిని బెంగ‌ళూరు ప్లేయ‌ర్ ఫించ్ ఆడ‌గా దాన్ని ఆపే ప్ర‌య‌త్నంలో మిచెల్ మార్ష్ కాలి మ‌డ‌మ బెణికింది. అయితే త‌రువాత అత‌ను బౌలింగ్ చేయ‌న‌ప్ప‌టికీ మ్యాచ్‌లో జ‌ట్టు ఇన్నింగ్స్ ఆడే స‌మ‌యంలో అత‌ను నం.10 స్థానంలో ఇబ్బంది ప‌డుతూనే బ్యాటింగ్‌కు దిగాడు. కానీ మొద‌టి బంతికే అత‌ను ఔట్ అయ్యాడు.

ఈ క్ర‌మంలో గాయం బారిన ప‌డిన మిచెల్ మార్ష్ ఈసారి ఐపీఎల్ మొత్తానికీ దూర‌మ‌య్యాడు. అత‌ని స్థానంలో వెస్టిండీస్ ప్లేయ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్ టీంలో చేర‌నున్నాడు. కాగా మార్ష్‌ను హైద‌రాబాద్ జ‌ట్టు రూ.2 కోట్ల‌కు కొనుగోలు చేసింది. గ‌తంలో 2017 ఐపీఎల్ సీజ‌న్ లోనూ మార్ష్ ఇలాగే గాయం బారిన ప‌డి సీజ‌న్ మొత్తానికీ దూర‌మ‌య్యాడు. కాక‌పోతే అప్పుడు అత‌ను పూణె జ‌ట్టుకు ఆడాడు. ఇప్పుడు హైద‌రాబాద్‌కు ఆడుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version