ఘట్టమనేని వారసుడు ..తండ్రికి తగ్గ తనయుడు

-

ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.. సినిమాలలోకి వచ్చాక కృష్ణ ఘట్టమేని గా మారారు. తేనె మనసులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కృష్ణ ఎన్నో కష్టాలను ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అయినా సహనం, ఓర్పుతో ఇండస్ట్రీలో ఎలాంటి వాళ్ళు ఎన్ని విధాలుగా వ్యాఖ్యలు చేసిన తన ఆత్మ విశ్వాసాన్ని నమ్ముకొని ముందుకు సాగారు. చేసిన ప్రతీ సినిమాని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. చెప్పాలంటే కృష్ణ చేసిన సాహసాలు ఇండస్ట్రీలో మరే హీరో చేయలేదని చెప్పాలి.

 

సీనియర్ ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ కంటే తర్వాత ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఆ ఇద్దరికంటే ఎక్కువ సినిమాలు చేసి రికార్డ్ ని సాధించారు. గూడాఛారి 116 తర్వాత కృష్ణ కెరీర్ లో నటించిన మూడవ సినిమా. ఈ సినిమా తర్వాత మళ్ళి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు 350 సినిమాలలో నటించడం గొప్ప విషయం. అంతేకాదు మల్టీ స్టారర్ అంటే ముందుండే ఏకైక హీరో కృష్ణ.

 

గూడాఛారి 116, మోసగాళ్ళకు మోసగాళ్ళు వంటి సినిమాలతో జేంస్ బాండ్ హీరో..సూపర్ స్టార్ కృష్ణ…డేరింగ్ అండ్ డాషింగ్ హీరో …ఇలా బిరుదలను సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ప్రయోగాలను చేయాలన్నా కృష్ణ ముందుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో నాటి తరం హీరోల నుండి నేటి తరం హీరోల వరకు ఎంతో మంది టాలీవుడ్ లో ఉన్న వాళ్ళు కృష్ణ ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఒకేసారి మూడు సినిమాలని చేసిన ఘనత కృష్ణ కే దక్కింది.

 

ఒకరోజులు మూడు షిఫ్ట్ లు పనిచేశారు. ఉదయం 7 నుండి 12, 1 నుండి 5 ఆ తర్వాత 6 నుండి 10 గంటల వరకు ప్లాన్ చేసుకొని ప్రతీ రోజూ మూడు సినిమాలు చేశారు. అలా నాన్ స్టాప్ గా 10 సంవత్సరాలు దాదాపు 100 సినిమాలకి పైగా నటించారు. బహుషా ఇలా చేసిన ఒకే ఒక్క హీరో కృష్ణ కావడం విశేషం. ఇక అగ్నిపర్వతం, అల్లూరి సీతారామరాజు, సింహాసనం వంటి సినిమాలు కృష్ణ కెరీర్ లో ఎన్నో ఉనాయి. ఈ సినిమాలతో తీసుకున్న డేరింగ్ స్టెప్ ఆయనకి తిరుగులేని ఇమేజ్ ని క్రేజ్ ని సంపాదించి పెట్టింది.

 

ఇక తన వారసత్వంగా ముగ్గురు కొడుకులు.. కూతురు మంజుల ఇప్పుడు అల్లుడు సుధీర్ బాబు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ప్రత్యేకంగా చెప్పల్సింది ఆ సూపర్ స్టార్ తనయుడు ఈ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి. తండ్రి లోని ధైర్యాన్ని, మొండి తనాన్ని, పట్టుదలను ఏమాత్రం వదలకుడా తండ్రి మార్గంలోనే కొనసాగుతున్నాడు. ఆ జనరేషన్ లో కృష్ణ ఎంతటి క్రేజ్ ని సాధించారో అంతటి క్రేజ్ ని ఈ జనరేషన్ లో మహేష్ బాబు సాధించడం విశేషం.

 

తండ్రి మాదిరిగానే కథ ల ఎంపికలోను, నిర్మాతల హీరోగాను తండ్రినే అనుసరిస్తున్నాడు. నాని, ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మల్టీస్టారర్ చేయడానికి అంగీకరించి ప్రయోగాలకి ముందుంటున్నాడు. ఇక కృష్ణ కి మహేష్ మీద ఎంత ప్రేమ ఉందో ఒక్క భావంతో చెప్పడం అది కేవలం మహేష్ కి మాత్రమే అర్థమవడం ఆసక్తికరమైన విషయం.

 

మహేష్ కి ఒక్క భారీ సక్సస్ వస్తే తండ్రీగా కృష్ణ ఎంతగా మురిసిపోతారో సరిలేరు నీకెవ్వరు సక్సస్ తర్వాత అందరూ ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా బాప్ అంటున్నారంటూ చెప్పిన సందర్భమే చక్కటి ఉదాహరణ. ఇక ఆ సూపర్ స్టార్ ఈ సూపర్ స్టార్ నుండి ఎప్పుడు కోరుకునే గిఫ్ట్ ఒక భారీ హిట్ మాత్రమే. ఆ గిఫ్ట్ ని మరోసారి మహేష్ సర్కారు వారి పాట సినిమాతో ఇవ్వబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news