దిశ నిందితుల మృతదేహాలు అప్పగింతపై.. సుప్రీం కీలక నిర్ణ‌యం

-

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ జరుపుతుండగానే మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇక తాజాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎవ్వరూ విచారణ చేపట్టవద్దని, తాము ఏర్పాటు చేసిన కమిషన్‌కు మాత్రమే అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో మృతదేహాలను ఏం చేయాలన్న దానిపై హైకోర్టు ఏం తేల్చుకోలేకపోయింది. మ‌రోవైపు దిశ నిందితుల మృతదేహాలు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఉన్నాయి. వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

అయితే హైకోర్ట్ తాము ఏ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టును తలుపు తట్టగా.. దిశ హత్యోదంతంలో మృత దేహాల అపపగింతకు సుప్రీం కోర్టు అంగీకరించలేదు. ఈ అంశం పై గురువారం రాత్రి కీలక ఆదేశాలతో కూడిన ఒక ప్రకటనను సుప్రీం కోర్టు వెలువరించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు మృతదేహాలను భద్రపరఛి ఉంచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మృతదేహాల అప్పగింతపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక మ‌రోవైపు ఈ కేసులో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news