బ్రేకింగ్ : “సెంట్రల్ విస్టా” ప్రాజెక్టు కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిడిఎ చట్టం కింద కేంద్ర అధికారాలు చెల్లుబాటు అవుతాయని  సుప్రీంకోర్టు పేర్కొంది.  పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతుల సిఫార్సులు చెల్లుబాటు అవుతాయని మరియు సరైనవని వాటిని మేము సమర్థిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.  నిర్మాణ పనులు ప్రారంభించడానికి “హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ” అనుమతి అవసరమని పేర్కొన్న సుప్రీంకోర్టు, కమిటీ నుంచి అనుమతి పొందాలని కేంద్రాన్ని  ఆదేశించింది.

రాష్ట్రపతి భవన్ నుంచి “ఇండియా గేటు” వరకు 3 కిలోమీటర్ల దూరం వరకు, పచ్చదనానికి విఘాతం కలుగకుండా అభివృధ్ది చేయాలన్నది తమ ఆలోచన అని ప్రభుత్వం పేర్కొంది. “రాజపధ్” మార్గంకు ఇరువైపులా ఉన్న శాస్త్రి భవన్, కృషి భవన్, రైలు భవన్, ఉద్యోగ భవన్, నిర్మాణ భవన్, వాయుసేన భవన్ లను పడగొట్టి, సర్వహంగులతో ఒక్కొక్కటి 8 అంతస్తులుండే 10 నూతన భవనాలను నిర్మించేందుకు రూపకల్పన చేశారు.