పెగాసన్ స్పైవేర్ అంశంపై ‘సుప్రీం’లో విచారణ

-

పెగాసన్ స్పైవేర్ అంశంపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిగింది. కమిటీ ఇచ్చిన ఫిర్యాదును ధర్మాసనం పరిశీలించింది. ఈ మేరకు 29 ఫోన్లను పరీక్షించగా.. అందులో 5 ఫోన్లల్లో మాల్‌వేర్‌ను గమనించినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు. కానీ ఒక్క ఫోన్‌లో కూడా పెగాసన్ స్పైవేర్ ఉన్నట్లు గుర్తించలేదని కోర్టు తెలిపింది. అయితే పెగాసన్ స్పైవేర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని చీఫ్ జస్టిస్ తెలిపారు. ఈ మేరకు కమిటీ ఇచ్చిన రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు.

పెగాసన్ స్పైవేర్
పెగాసన్ స్పైవేర్

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీనే ఈ రిపోర్టు తయారు చేస్తోందని వెల్లడించారు. ఈ క్రమంలో మూడు భాగాలుగా రిపోర్టులు తయారు చేయనున్నారు. అయితే ఇందులో రెండు టెక్నికల్ కమిటీ రిపోర్టులు ఉంటాయి. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ మరో నివేదికను సమర్పించనున్నారు. అయితే రవీంద్రన్ సమర్పించే నివేదికను తన వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయనున్నట్లు సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news