గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టుకు సీబీఐ

-

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే వివేకా హత్య కేసు నిందితుల్లో ఒకరైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

గంగిరెడ్డి బయట ఉంటే సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందని.. వారిని రక్షించుకోవాలంటే ఆయన బెయిల్‌ రద్దు చేయాల్సిందేనని సీబీఐ అధికారులు ధర్మాసనాన్ని కోరారు. నిందితులు, రాష్ట్ర పోలీసులు కుమ్మక్కై విచారణ జరగకుండా చూశారని సీబీఐ వాదించింది.

సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌ ధర్మాసనం ఎర్ర గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్‌ 14కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news