‘నోటా’ కి ఎక్కువ ఓట్లు.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు..!

-

సాధారణంగా ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది. దీనిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. ఈ అంశంపై భారత ఎన్నికల సంఘానికి  నోటీసులు జారీ చేసింది. శివ్ ఖేరా అనే రచయిత పిల్  ద్వారా లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం అంగీకరించింది.

నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను తదుపరి ఎన్నికల్లో ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు రూపొందించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు.. నోటాను ‘కల్పిత అభ్యర్థి’గా తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలను రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇటీవల సూరత్ లో పోలింగ్ జరగకుండానే ఓ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన తీరును ప్రస్తావించారు. పిటిషనర్ చేసిన ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. ఈసీకి నోటీసులు పంపించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version