గత కొంతకాలం క్రితం సౌత్ ఆఫ్రికా మరియు నమీబియా దేశాల నుండి చీతాలను మధ్యప్రదేశ్ కునో పార్క్ లో ఉంచిన సంగతి తెలిసిందే. కానీ రోజుల గ్యాప్ తో ఒక్కొక్కటిగా కొన్ని చేతలు మరణించాయి. కారణాలు ఏమిటన్నది తెలియకపోయినా ప్రదేశం మారాయి కాబట్టి వాతావరణం అనుకూలించక చనిపోయి ఉంటాయని అధికారులు చెప్పారు. ఈ విషయంపై నేడు సుప్రీమ్ కోర్ట్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అందులో భాగంగా ముందుగా కేంద్రాన్ని కునో పార్క్ లో చీతాలను ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. అక్కడ ఉన్న కొన్ని చీతాలను వెంటనే రాజస్థాన్ కు పంపించండి అంటూ ఆదేశాలను జారీ చేసింది. కాగా ఈ ప్రశ్నకు కేంద్రం సుప్రీమ్ కోర్ట్ కు సరైన సమాధానాన్ని చెప్పింది, మాములుగా చీతాలు తన ప్రదేశాల నుండి వచ్చాకా ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాలంటే టైం పడుతుందని వివరణ ఇచ్చారు.
కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మొత్తం 20 చీతాలు విదేశాల నుండి రాగా వాటిలో 8 చీతాలు మరణించాయి. ఇప్పుడు మిగిలిన వాటిని రాజస్థాన్ కు తరలిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.