ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ని కలిసిన తరువాత రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కోసమే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్ళారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు మంత్రి పినిపే విశ్వరూప్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేనేలేదని స్పష్టం చేశారు.
ప్రజలు తమకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని.. అందువల్ల ఐదేళ్లు పరిపాలన చేయడం జరుగుతుందన్నారు. యధావిధిగా ఏప్రిల్ లోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇక పొత్తుల కోసం వెంపర్లాడాల్సిన అవసరం తమకు లేనేలేదని.. గెలవలేమనే ధైర్యం లేనివాళ్లే పొత్తుల కోసం వెళతారని అన్నారు. సంక్షేమ పథకాలు రుచి చూసిన తరువాత ప్రభుత్వం మారాలని ఎవరు కోరుకోరని అన్నారు.