ఆర్టికల్ 370 అంశంపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం

-

ఆర్టికల్ 370 రద్దు, యూటీలుగా జమ్మూకాశ్మీర్ విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. 16 రోజులు వాదనలు విన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

చివరి రోజు విచారణలో సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణియమ్, రాజీవ్ ధావన్, జఫర్ షా, దుష్యంత్ దవే, తదితరుల వాదనలు వినిపించారు. అలాగే రాతపూర్వక వాదనలు దాఖలు చేయాలనుకునే పిటిషనర్లు లేదా ప్రతివాదుల తరపున వాదించే న్యాయవాదులకు సుప్రీంకోర్టు మూడు రోజుల గడువు విధించింది. అయితే, ఆ వాదనలు రెండు పేజీలకు మించకూడదని కోర్టు షరతు విధించింది. 16 రోజుల విచారణ ప్రక్రియలో సుప్రీంకోర్టు వివిధ న్యాయ ప్రముఖుల వాదనలు విన్నది.
ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, రాకేష్ ద్వివేది, వి.గిరి వాదనలు వినిపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version