ఎన్నికల ఓటర్ లిస్టులో డూప్లికేట్ ఓటర్లు ఇంకా ఉన్నారు : పేర్ని నాని

-

మాజీ మంత్రి పేర్ని నాని ఏపీలో ఎన్నికల ఓటర్ లిస్టులో డూప్లికేట్ ఓటర్లు ఇంకా ఉన్నారు అని అన్నారు. . ఒకే పేరు.. ఒకే ఐడీ.. ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయి.. దీన్ని సరి చేయాలని ఎన్నికల అధికారిని కోరామని అన్నారు నాని. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని వైసీపీ నేతలు కలవడం జరిగింది. ఏపీ ఓటర్ లిస్టులో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ గగ్గోలు పెడుతోంది.. వైసీపీ ప్రభుత్వం.. పార్టీ ఓటర్ల జాబితాలో అక్రమాలు పాల్పడుతోందని నేరాలు మోపుతోంది.. బీజేపీ పార్టీ కూడా ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ పదవి పోయిన ఓ నేత వచ్చి మాట్లాడుతున్నారు అని పేర్నినాని హేళన చేశారు.

దొంగ ఓట్లను కలిపి గెలవాలనే పిచ్చి ఆలోచన కేవలం చంద్రబాబుకే సాధ్యం అని పేర్నినాని ఎద్దేవ చేశారు. సేవా మిత్ర యాప్ ద్వారా వైసీపీ సానుభూతి పరుల 50 లక్షల ఓట్లను తొలగించారు.. గజ దొంగే నీతి కబుర్లు చెబుతున్నట్టు.. ఆవు తోలు కప్పుకున్న నక్కలా చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నారు.. వైసీపీపై చంద్రబాబు బురదజల్లుతున్నారు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తోందన్న సంజయ్ కామెంట్లను తప్పుబట్టారు పేర్ని నాని.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version