ఎర్రకోట ఉగ్రదాడి దోషికి ఉరే కరెక్ట్ : సుప్రీం కోర్టు

-

2000 ఎర్రకోట ఉగ్ర దాడి కేసులోని దోషికి ఉరే సరైందంటూ సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. మరణ శిక్ష తీర్పును పునఃసమీక్షించాలంటూ నిందితుడు చేసిన అభ్యర్థనను ఇవాళ విచారించిన కోర్టు పిటిషన్​ను కొట్టివేసింది. ఎలక్ట్రానిక్ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్న అభ్యర్థనను అంగీకరించినట్లు చీఫ్ జస్టిస్ యూయూలలిత్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

“ఎలక్ట్రానిక్ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్న అభ్యర్థను మేము అంగీకరించాము. అతని నేరం రుజువైంది. కోర్టు తీసుకున్న అభిప్రాయాన్ని మేము ధృవీకరించి రివ్యూ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాము” అని ధర్మాసనం పేర్కొంది. అయితే ఆ దాడుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లతో పాటు ముగ్గురిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల్లో ఆరిఫ్​ ఒకడు. కాల్పులు జరిగిన మూడు రోజుల తర్వాత ఆరిఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2005 అక్టోబర్ 24న, ట్రయల్ కోర్టు అతడిని దోషిగా నిర్ధరించి అక్టోబర్ 31న మరణశిక్ష విధించింది. దీంతో అతడు మరణశిక్ష తీర్పును పునఃసమీక్షించాలని ఉన్నత న్యాయస్థానాల్లో పిటిషన్​లు దాఖలు చేస్తూ వచ్చాడు. అలా 2007లో దిల్లీ హైకోర్టు, 2011లోనూ రెండు సార్లు సుప్రీం కోర్టు అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది. మళ్లీ రివ్యూ పిటీషన్​ను దాఖలు చేయగా తాజాగా దాన్ని కూడా కొట్టి పారేసింది సుప్రీం.

Read more RELATED
Recommended to you

Latest news