బిగ్ న్యూస్ : రేపే “చిరు 153” సర్ ప్రైజ్

-

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో తన ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి 153 వ సినిమాకు సంబంధించి రేపు కీలక ప్రకటన రానుంది. ఎల్లుండి చిరంజీవి పుట్టిన రోజు ఉన్న సందర్భంగా… రేపు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించే సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేయనుంది.

రేపు సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ రానుంది. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఆర్.బి.చౌదరి తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో నటీనటుల గురించి రేపటి ప్రకటనలో చిత్ర బృందం తెలుపను ఉందని సమాచారం అందుతోంది. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి… కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆచార్య సినిమా చివరిదశ షూటింగ్ లో జరుపుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news