ఉత్తమ నటిగా అక్కినేని సమంత ఎంపిక…

-

సినీ నటులు ప్రతిష్టాత్మకం గా భావించే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్  అవార్డులు ఇవాళ వెలువడ్డాయి. 2021 సంవత్సరానికి గాను ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్  అవార్డు లను ప్రకటించేసింది. అయితే ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా సూర్య నటించిన సురారై పొట్రు (ఆకాశమే నీ హద్దురా ) సినిమా ఎంపిక కాగా…. ఉత్తమ నటుడిగా సూర్య ఎంపికయ్యారు.

అలాగే ఈ అవార్డుల్లో ఉత్తమ వెబ్ సిరీస్ గా ఫ్యామిలీ మాన్ 2 ఎంపిక యింది. అయితే ఈ వెబ్ సిరీస్ ఉత్తమ నటీ నటులుగా అక్కినేని సమంత మరియు మనోజ్ బాజ్ పాయి ఎంపికయ్యారు. వీరిద్దరూ ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో నటించారు. 27 భాషలకు చెందిన 120 కి పైగా చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఇందులో అక్కినేని కోడలు సమంత ఉత్తమ నటిగా అవార్డు పొందడం గమనార్హం. ఇక సమంత ఫాన్స్ లో కోలాహలం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news